![]() |
![]() |
.webp)
సోషల్ మీడియా సెలబ్రిటీగా పాపులర్ ఐన కుమారి ఆంటీ గురించి తెలియని వాళ్లే లేరు. ఆమెను స్టార్ మా ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ ఉత్సవం షోకి తీసుకొస్తే.. జీ తెలుగు వాళ్లు డైరెక్ట్ గా సీరియల్స్‌లోకి తీసుకొచ్చేశారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ అనే సీరియల్ 384 ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు సీరియల్ మేకర్స్. ‘ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుగు సాంప్రదాయ ప్రసాదాల తయారీదారుల కోసం టెండర్ ఆహ్వానించగా.. హీరోయిన్ ఈశ్వరి టెండర్ వేయడానికి వెళ్తుంది. ఈశ్వరి ప్రెజెంటేషన్ ఇస్తేనే.. దాన్ని చూసి నెక్స్ట్ రౌండ్‌కి పంపించగలం అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ చెప్పడంతో.. ఈశ్వరి టెన్షన్ పడుతూ, చెమటలు కక్కుతూ ఉంటుంది.
ఇంతలో ఆడియన్స్ లో కూర్చున్న కుమారీ ఆంటీ లేచి స్టేజ్ మీదకు వెళ్తుంది. ఆమె ఎంట్రీకి వెనక నుంచి విజిల్సూ.. చప్పట్లూ బాగానే పడ్డాయి. స్టేజి మీదకు వచ్చి మైక్ తీసుకుంటుంది.. ఇంతలో అక్కడి యాంకర్ "మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి" అని కుమారి ఆంటీని అడుగుతుంది ‘నాకు తెలుసమ్మా. కానీ నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి రాలేదు.. ఈశ్వరి గురించి మాట్లాడటానికి వచ్చాను’ అంటూ స్టోరీలో ట్విస్ట్ ఇచ్చింది కుమారి ఆంటీ. ఇక ఫుడ్ బిజినెస్ చేసే కుమార్ ఆంటీ ఇప్పుడు సెలబ్రిటీ ఐపోయింది. ఐతే ఈమె ఫుడ్ ని టేస్ట్ చేసిన వాళ్ళు అంత టేస్ట్ లేదు అంటూ వీడియోస్ కూడా చేస్తున్నారు. మరి ఎందుకు అంత ఫేమస్ అయ్యిందో కుమారి ఆంటీ తెలియడం లేదు అని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె ఇంటర్వ్యూలే కనిపిస్తాయి. ఈమె మాటలకు పాటలు కట్టి సెలబ్రిటీస్ రీల్స్ చేసి వాళ్ళు కూడా ఫేమస్ అయ్యారు. ‘ రెండు లివర్లు ఎక్స్ ట్రా.. మొత్తం 1000 అయ్యింది’ అనే డైలాగ్ ఈమెది ఫుల్ ట్రెండ్ అయ్యింది.
![]() |
![]() |